సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బస్టాండ్ నుంచి అమలాపురంకు వెళ్లే ఆర్టీసి నూతన ఎక్స్ ప్రెస్ బస్సును నేడు మంగళవారం ఎమ్మెల్యే అంజిబాబు జెండాఊపి ప్రారంభించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించడంలో ఆర్టీసీ ముందుంటుందని, భీమవరం నుంచి అమలాపురంకు ఇప్పటికే 6 బస్సులు ఉన్నాయని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. అయితే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నూతన సర్వీసులను కూడా పెంచుతామన్నారు. ఆర్టీసీ డిపో మేనేజర్ పిఎన్ విఎం సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ప్రయాణికులు త్వరితగతిన వెళ్లేందుకు భీమవరం బస్టాండ్ నుండి ప్రతీ 25 నిమిషానికి ఒక బస్ నడుపుతున్నామని, భీమవరం నుండి పాలకొల్లు – రాజోలు, జగ్గన్నపేట, మామిడికుదురు మీదుగా అమలాపురం వెళ్ళే ఈ సర్వీసును ప్రయాణికులు ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
