సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: APs ఆర్టీసి ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తూ నూతన సర్వీసులను కూడా మెరుగుపరుస్తుందని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. నేడు, శనివారం భీమవరం నుంచి అమలాపురం కు నూతన బస్సును ఎమ్మెల్యే అంజిబాబు భీమవరం ఆర్టీసి బస్టాండ్ లో జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ .. ప్రయాణికుల రద్దీని బట్టి నూతన బస్సులను ఎక్కువ సర్వీసులను ఆర్టీసి ఏర్పాటు చేస్తుందని, అమలాపురం కు భీమవరం నుంచి ఇప్పటి వరకు 12 సర్వీసులు ఉన్నాయని, ఇప్పుడు నూతన బస్సు ను ప్రారంభించామని అన్నారు. ఆర్టీసి డిపో మేనేజర్ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత, వారి ప్రయాణంకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్వీసులు అందించడమే ఆర్టీసి లక్ష్యమన్నారు. . కార్యక్రమంలో జనసేన నాయకులు, టౌన్ హాల్ జాయింట్ సెక్రటరీ బండి రమేష్ కుమార్, ముచ్చకర్ల శివ, ఆర్టీసి అసిస్టెంట్ మేనేజర్ వై సురేష్, ఆర్టీసి సిబ్బంది పాల్గొన్నారు
