సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం పరిధిలోని వీరవాసరంలో జన్మించి స్థానిక ఎంఆర్ కే జెడ్పీ హైస్కూల్లో చదువుకున్న ప్రస్తుత కేరళ డిజిపిగా పని చేస్తున్న ‘రావాడ అజాద్ చంద్రశేఖర్’ ను అదే హైస్కూల్ లో పౌర సన్మానం చేశారు. సభాధ్యక్షత వహించిన ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. ఒక సామాన్య వ్యక్తి చరిత్ర సృష్టించారని,వీరవాసరం గ్రామంలోనే చదివి నేడు కేరళ రాష్ట్రానికి పోలీస్ బాస్ గా నియమితులు కావడం గర్వించదగ్గ విషయమని, నేటి యువత విద్యార్థులు అజాద్ చంద్రశేఖర్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.ఆయన పట్టుదల కృషితో ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో చదువుకుని ఈ స్థాయికి చేరుకున్నారని, అన్నారు. కేరళ రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ క్రమశిక్షణతో నడిపించాలని కోరుకుంటున్నానని, వారికి అభినందనలు తెలిపారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి . జిల్లా ఎస్పీ నయీం అస్మీ లు మాట్లాడుతూ మన భీమవరం ప్రాంత వాసి కేరళ రాష్ట్ర డిజిపిగా ఉండటం హర్షించదగ్గ విషయమన్నారు. కేరళ .. డిజిపి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నేను నా సొంత ప్రాంతాన్ని స్నేహితులను ఎప్పుడు గుర్తు ఉంచుకొన్నానని నా విజయానికి తల్లిదండ్రుల దైవత్వం, గురువుల ఆశీస్సులేనని, ఒక సాధారణ విద్యార్థి నేడు డిజిపిగా నియమితు లైయ్యాయని అన్నారు. ప్రతి విద్యార్థికి సమయ పాలన ఉండాలని, 24 గంటలు ఏ విధంగా నడుచుకోవాలో లక్ష్యాలను సాధించుకోవాలో నిర్ణయించుకోవాలన్నారు. నాయకులకు పదవులు ముఖ్యం కాదని, మంచి వ్యక్తిత్వం, సేవా గుణం ముఖ్యమన్నారు. 1981లో ఈ స్కూల్లోను, 82,83లోభీమవరం లోను ఇంటర్ పూర్తి చేసుకున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మహిళా వేల్పేర్ కార్పోరేషన్ చైర్మన్ పీతల సుజాత, అడిషనల్ ఎస్పీ భీమారావు, డిప్యూటీ కలెక్టర్ పద్మ, సివిల్ జడ్జి గోపాలకృష్ణ, సర్పంచ్ చికిలే మంగతాయారు, ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, జెడ్పీటీసీ గుండా జయప్రకాష్, డీఈవో నారాయణ, ఇక్కడే ఉన్న కేరళ డిజిపి కుటుంబ సభ్యులు రావాడ చిరంజీవి రావు, రావాడ రామ్మోహన్, కమీషనర్ వరుణ్, సతీష్, జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *