సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ ఎమ్మెల్యే, కైకలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ జయమంగళ వెంకటరమణకు ప్రమాదం తప్పింది. భీమవరం లో వ్యక్తిగత పనులు చూసుకొని నేటి సోమవారం భీమవరం నుంచి కైకలూరు వస్తుండగా కైకలూరు మండలం ఉప్పుటేరు వద్ద ఎదురుగా వస్తున్న ఓకే బొలెరో కారు చాలావేగంగా వచ్చి జయ మంగళ కారును ఢీకొట్టి ఆగకుండా పరారయ్యారు. బొలెరో తమను ఢీ కొట్టబోతుందని క్షణ కాలంలో ఊహించిన జయమంగళ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. కారు ముందు భాగం మాత్రం పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంపై కైకలూరు రూరల్ పోలీసులకు మాజీ ఎమ్మెల్యే జయమంగళ ఫిర్యాదు చేయడంతో ఎస్సై చల్లా కృష్ణ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దర్యాప్తు లో వాస్తవాలు వెలుగులోకివస్తాయి.
