సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లోని తన కార్యాలయంలో రాష్ట్ర శాసన మండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు నేడు, సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయంలో ఆనాటి సీఎం జగన్ సహకారంతో నాటి స్థానిక ఎమ్మెల్యే , నా కృషి ఫలితంగా నరసాపురంకు బదులుగా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో ప్రస్తుతం తాత్కాలికగాము గ ప్రకృతి ఆశ్రమం సమీపంలో ఏర్పటు చేసిన జిల్లా కలెక్టర్ కార్యాలయం త్వరలో స్థానిక మార్కెట్ యార్డులో శాశ్వత భవన నిర్మాణాలతో ఏర్పాటు చేస్తారని అందరు భావించారని ఐతే తాజగా భీమవరం నుండి జిల్లా కలెక్టరేట్ ను తరలిస్తారని దానికి సంబందించి చంద్రబాబు సర్కార్ కొత్త జిఓ రిలీజ్ చేస్తుందని వస్తున్నా వార్తలు నేపథ్యంలో భీమవరం వాసులకు ఆందోళన కలిగిస్తున్నాయని.. ఇప్పటికే రాష్ట్రంలో భీమవరం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో అందరికి తెలిసిందేనని,అధికారులకు అన్ని వసతులు ఉన్న పట్టణం అని, దీనికి స్థానిక ప్రముఖుల , ప్రజల కృషి ఎంతో ఉందని, అటువంటిది కస్టపడి సాధించుకొన్న జిల్లా కేంద్రం లో కలెక్టర్ కార్యాలయం తరలించి మరో నియోజకవర్గంలో (ఉండి..కాళ్ళ మండలంలో ?)ఏర్పాటు చెయ్యడానికి జరుగుతున్నా సన్నాహాలు తాను వ్యక్తిగతంగా సమర్ధించనని, దానిని అడ్డుకోవడానికి అన్ని పార్టీల నేతలు సంఘాలు ఏకమవ్వాలని ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకోని వెళతానని , కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా భీమవరం వారే కావడం వల్ల ఆయన కూడా కలెక్టరేట్ తరలింపు ఫై వివరణ ఇవ్వాలని కొయ్య మోషేను రాజు విజ్ఞప్తి చేసారు.
