సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నుండి నేడు, శనివారం ఉదయం నుండి దెందులూరు లో జరుగుతున్నా సిద్ధం బహిరంగ సభలో పాల్గొన్నాడనికి విశేషంగా పలు ప్రవేటు, విద్య సంస్థల బస్సులలో స్థానిక వై ఎస్ ఆర్ పార్టీ నేతలు తరలి వెళ్లారు. భీమవరం పట్టణంలోని అన్ని వార్డులను నుండి స్థానిక లీడర్స్ ప్రత్యేక వాహనాల్లో దెందులూరు బయలు దేరి వెళ్లడం జరిగింది. మెంటే వారి తోట స్థానిక బై పాస్ రోడ్డు నుండి వరుసగా వాహనాలు బయలు దేరి వెళ్లాయి. వాహనాలకు వైసిపి బ్యానేర్స్ , జగన్ చిత్ర పటాలు తో అలంకరించి నినాదాలు చేస్తూ వైసిపి శ్రేణులు సందడి చేస్తూ బయలు దేరారు. స్థానిక ఎమ్మెల్యే కుమారుడు గ్రంధి రవితేజ వారిని పర్యవేక్షించారు. భీమవరం నుండి దెందులూరు సభకు ముందుగానే చేరుకొన్న శాసనమండలి చైర్మెన్ మోషన్ రాజు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సీఎం జగన్ కుఅక్కడ వేదిక ఫై చేరుకొనే ముందు స్వాగతం పలకడం జరిగింది. ఇంకా పలువురు నేతలు భీమవరం నుండి విశేషంగా తరలి వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *