సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చి మగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మె ల్సీ స్థానాలకు అధికార వైసిపి అభ్యర్థులను ఖరారు చేసింది. సామాజిక లెక్కలు బేరీజు వేసుకుని బీసీ ఓటుబ్యాం కును దృ ష్టిలో ఉం చుకుని శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన జిల్లా పరిషత్తు ఛైర్మన్ కవురు శ్రీనివాస్ , కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త వంక రవీంద్రనాథ్ పేర్లను ప్రకటించారు. పాలకొల్లు నుండి మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు కు దాదాపు ఎమ్మెల్సీ ఖరారు అయిందని తీవ్ర ప్రచారం జరిగినప్పటికీ అది నిజం కాలేదు. ఐతే విచిత్రమైన విషయం ఏమిటంటే ? భీమవరం నియోజక పరిధిలోనే ఇప్పటికే ఎమ్మెల్సీ , శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు ఉండగా మరొక ఎమ్మెల్సీ పదవి ప్రస్తుతం యలమంచిలి జడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్మెన్ గా కీలక పదవిలో ఉంటూ పాలకొల్లు పార్టీ ఇంఛార్జిగా కొనసాగుతున్న బీసీ నేత కవురు శ్రీనివాస్ కు కేటాయించడం విశేషం. 2014 లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లో కేవలం 3 జడ్పీ స్థానాలలో వైసిపి గెలుపొందగా అందులో వీరవాసరం జడ్పీ స్థానాన్ని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సహకారంతో వైసీపీ తరపున గెలుచుకొని సంచలనం రేపిన ‘కవురు శ్రీనివాస్’ వైసిపి అధినేత జగన్ దృష్టిని ఆకర్షించి అంచెలు అంచెలుగా ఎదిగి ( వైసిపి బలం దృష్ట్యా )అతి త్వరలో ఎమ్మెల్సీ కానున్నారు. వీరవాసరం మండలం నవుడూరులో కవురు శ్రీనివాస్ కాంపౌండర్ గా పనిచేశారు. మంచి కలుపుగోరు మనిషిగా.. అక్కడ ఉత్తరపాలెం నుంచి ఎంపీటీసీ గా గెల్చి ఎంపీపీగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.. ఆలా అంచెలు అంచెలుగా ఎదుగుతూ మరికొద్ది రోజులలో ఎమ్మెల్సీ కానున్న కవురు శ్రీనివాస్ కు సిగ్మా న్యూస్ తరపున అభినందనలు
