సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: భీమవరం 21వ వార్డు పెద్ద వంతెన నుంచి టౌన్ హాల్ మీదుగా ప్రభుత్వాసుపత్రి వరకు జరుగుతున్న సీసీ రోడ్డు పనులను మంగళవారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పరిశీలించారు.15వ ఆర్థిక సంఘం నిధులు రూ 97 లక్షలతో ఈ పనులు జరుగుతున్నాయని, త్వరగా పనులను పూర్తి చేయాలన్నారు. పట్టణంలోని అన్ని రహదారులను సీసీ రోడ్లు వేయిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు పాల్గొన్నారు.
