సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి పంచారామ క్షేత్రంలో మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేదమంత్రాల తో చంద్ర ప్రతిష్ట మహాశివునికి రుద్రాభిషేకాలు, అమ్మవార్లకు కుంకుమ పూజలు, పల్లకి ఊరేగింపులు, కల్యాణాలు తో పాటు 16 లక్షల రూ. ఖర్చుతో నిర్మించిన చలువ పందిళ్లు , లైటింగ్ సెట్టింగ్ అలంకరణలు , ఆలయ ఆవరణలో రాత్రి 10-30 గంటల వరకు జరుగుతున్నా సాంసృతిక కార్యక్రమాలు తో విశేష భక్త సందోహంతో ఆధ్యాత్మిక శోభ తో అలరారుతుంది. దాతల సహకారం తో దేవాలయ పుష్ప అలంకరణలు, భక్తులకు ప్రసాద వితరణ, దేవాలయ సత్రంలో నిత్యాన్నదాన ప్రసాదం పంపిణి చేస్తున్నారు. నేటి రాత్రి కూచిపూడి భారత నాట్యాలతో పాటు రాత్రి 9 గంటలకు మధు మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసారు. రేపు శనివారం మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో తెల్లవారు జాము 3 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సుమారు 50 వేల మంది పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తులకు వేగంగా స్వామివారి దర్శనానికి భారీ క్యూ లైన్ లు ఏర్పాటు చేసారు. పోలీస్ పికీటింగ్ ఉంది. రేపు మద్యహ్నం 3 గంటల నుండి పలు ఆధ్యాత్మిక ప్రదర్శనలు ఉన్నాయి. రాత్రి 7గంటలకు ఆలయ ఆవరణలో అఖండ దీపారాధన కార్యక్రమం దాతల సహకారంతో ఘనంగా నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటలకు స్వాతి మ్యూజికల్ ఆర్కెస్ట్రా విభావరి ఉంటుంది. స్థానిక భేమేశ్వర స్వామి దేవాలయం మరియు యనమదురు లో స్వయం భూ శ్రీ శక్తేశ్వర స్వామి దేవాలయాల వద్ద కూడా వేలాది భక్తుల దర్శనానికి భారీ ఏర్పాట్లు సిద్ధం చేసారు.
