సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు కార్తీకమాసోత్సవములలో భాగం గా నేడు 19 రోజు శనివారం భక్తులు విశేషంగా శ్రీ స్వామివారిని దర్శించుకొన్నారు. దేవాలయ ఆవరణలో దాతల సహకారంతో ప్రతి నిత్యం భారీ చలువ పందిళ్ళలో మధ్యాహ్నం షడ్రుచులతో జరుగుతున్నా నిత్యా అన్నసమారాధన కు భక్తుల నుండి విశేష స్వాందన లభిస్తుంది, ఈ రోజు సర్వదర్శనం తో పాటు భక్తులు టికెట్ తీసుకోని ప్రత్యక దర్శనముల ద్వారా రూ.71,750/_లు, పూజా రుసుముల ద్వారా రూ.12,048/లు మొత్తం రూ.83,798/-లు ఆధాయం రాగా, 548లడ్డులు ప్రసాదం గా విక్రయించటమైనది. అని దేవాలయ కార్యనిర్వహణాధికారి, డి రామ కృష్ణంరాజు తెలిపారు.
