సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పవిత్ర కార్తీక మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో పురాణ ప్రాశస్యం ఉన్నపంచారామాలలో అత్యంత మహిమానిత స్వయం చంద్ర ప్రతిష్ట గా భక్తులు భావించే భీమవరం గునుపూడి లోని శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి దేవాలయంలో ప్రతి ఏడాదిలానే నెల రోజుల పాటు కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహించానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రతి రోజు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశవ్యాప్తంగా వేలాది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించనున్నారు. భారీ చలువ పందిళ్ళలో బారికెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. నెల రోజుల పాటు ప్రతి రోజు భక్తులకు ‘దేవస్థానం ఆధ్వర్యంలో’ దాతల సహకారంతో అన్నసమారాధన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈనేపథ్యంలో పంచారామ క్షేత్రం నందు ది.02-11-2024 నుండి ది.01-12-2024 వరకు జరగబోవు కార్తీకమాసోత్సవముల నిమిత్తం వివిధ శాఖలతో సమన్వయ కమిటి సమావేశము రేపు మంగళవారం (ది.29-10-2024వ) సాయంత్రం గం.05-00లకు స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు , రెవెన్యూ డివిజినల్ అధికారి, భీమవరం వారిచే సమావేశం నిర్వహించి సలహాలు సూచనలు తీసుకోవడం జరుగుతుందని దేవాలయ ఇఓ రామకృష్ణంరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
