సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కార్తిక మాసం సందర్భంగా తెలుగునాట ప్రసిద్ధి పొందిన భీమవరం గునుపూడిలోని పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దనస్వామి ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడికీ దర్శనం కల్పించేలా దేవాదాయ, పోలీస్, రెవెన్యూ , మునిసిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. దేవాలయంలో జరిగిన సమావేశంలో కార్తిక మాసం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే అంజిబాబు, ధర్మకర్తల మండలి సభ్యులు,చైర్మన్ చింతలపాటి బంగార్రాజు, ఇఓ. డి రామకృష్ణంరాజు సమీక్షించారు. ఈనెల 22 నుంచి నవంబరు 20 వరకు నిర్వహించే కార్తిక మహోత్సవాల్లో 10 ముఖ్య రోజుల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు దర్శనం నిలిపివేత లు లేకుండా ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో, ఆర్డీవో ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ రావి రాంబాబు, మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి, సీఐ నాగరాజు, జిల్లా దేవాదాయశాఖాధికారి హరి సూర్యప్రకాష్, భీమేశ్వర స్వామి దేవాలయ చైర్మెన్ గనిరెడ్డి త్రినాథ్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
