సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో వేంచేసియున్న పంచారామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు సుదీర్ఘ కాలంగా దేవాలయ ఆవరణలో జరుగుతున్నా నిత్యాన్నదానం ఈ రోజు ఆదివారం నుండి నిత్య అన్నదాన కార్యక్రమం భక్తులు, గ్రామస్తుల సహాయ సహకారములతో పునః ప్రారంభించుట జరిగినది. ది.28-04-2024 నుండి ది.27-05-2024 వరకు స్థానికులు అయిన కూర్మదాసు భాస్కర రోహిత్, లవ్ లీశ్రేణిక దంపతులు, భక్తులకు 30 రోజులకు నిత్య అన్నదానం నిమిత్తం కైంకర్య సామాగ్రి సమర్పించడం జరిగింది. ఈ సందర్భములో నేడు, ఆదివారం 110 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించగా, భక్తుల నుండి రూ.32,673/-లు కానుకలుగా రావడం జరిగిందని దేవాలయ ఇఓ డీ. రామకృష్ణంరాజు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *