సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పంచారామ క్షేత్రాలలో అతి కీలకమైనదిగా సాక్షాత్తు శివస్వరూపంగా రంగులు మారె శివలింగం గా ప్రసిద్ధి పొందిన భీమవరంలోని గునుపూడిలోని సోమారామంలో ఈనెల 13వ తేదీ నుంచి 17వ వరకు జరిగే శివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం సోమేశ్వర స్వామి ఆలయంలో నేటి మంగళవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో శివరాత్రి ఉత్సవాలపై సమీక్షించారు. 5 రోజులపాటు పంచారామ క్షేత్రమైన భీమవరం శ్రీసోమేశ్వర స్వామి ఆలయం, మరియు శ్రీభీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, శివుని దర్శనం ప్రతి భక్తునికి కలిగేలా చూడాలని, రథోత్సవంలో ఎటువంటి పొరపాట్లు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు తరలివస్తారని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.. కార్యక్రమంలో ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి, డీఎస్పీ రఘువీర్ విష్ణు, తహసీల్దార్ రావి రాంబాబు, ఆలయ ఈవో రామకృష్ణంరాజు దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మెన్ బంగార్రాజు , పోలీసు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు ఇక ముఖ్య సూచనా ఏమిటంటే.. శివరాత్రికి శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం తాడేరు రోడ్డు నందుభక్తులు సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్వాగతం ఎంట్రన్స్ బోర్డు పనులు తాత్కాలికముగావాయిదా పడిన సందర్భంలో వాహనముల దారి మళ్లింపుది తేదిమార్చడం అయినదిగమనించగలరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *