సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో పురాణ ప్రాశస్యం ఉన్న గునుపూడి లోని పంచారామ పుణ్య క్షేత్రం ‘శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామివారి దేవాలయంలో రేపటి సోమవారం నుండి మహాశివరాత్రి నేపథ్యంలో శ్రీ స్వామివారి కల్యాణోత్సవాలు ప్రారంభం అవుతున్నాయని, 5 రోజులు జరిగే ఉత్సవాలకు వేలాది గా తరలివచ్చే భక్తుల దర్శనాల కోసం చలువ పందిళ్లు, క్యూ లైన్ ఏర్పాట్లు , వాహనాలకు పార్కింగ్ , పోలీస్ పికీటింగ్ ,ఆధ్యాతిమిక కార్యక్రమాలు, లైటింగ్,పుష్ప అలంకరణలుతో,రధోత్సవం, తెప్పోత్సవం లతో వైభవంగా నిర్వహిస్తున్నామని దేవాలయ కార్యనిర్వహణాధికారి డి రామకృష్ణంరాజు తెలిపారు. రేపు ఉదయం 5 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష పత్రీ పూజ తో కార్యక్రమాలు ప్రారంభమౌతాయి. రేపు సాయంత్రం 6 గంటలకు వేడుకలకు దేవా గణాలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం తో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. వేలాదిగా తరలి వచ్చే భక్తులకు జరిగే అన్న సమారాధన నిమిత్తం శ్రీ స్వామివారి అన్న సమారాధన ట్రస్టు కు విరాళాలాలు పంపవలసిన భక్తులు .. యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా.. భీమవరం బ్రాంచి.. అకౌంట్ నెంబర్: 004612010001074 మరియు ఐ ఎఫ్ సి ఐ కోడ్: U B I N 0800465 కు తమ డబ్బును పంపాలి.
