సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లోని పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో 10వ రోజు దసరా వేడుకలలో భాగంగా నేడు, బుధవారం శ్రీ పార్వతి అమ్మవారు సింహ వాహనంపై మహిషాసుర మర్ధిని అవతారంలోను, శ్రీ సోమేశ్వరుని పైన అంతస్తు లో ఉన్న శ్రీ అన్నపూర్ణ దేవి వారు మహిళ భక్తులకు నిండు సౌభాగ్యం, సకల భాగ్యాలు ప్రసాదించే శ్రీ గాజులమ్మ తల్లిగా దర్శనమిస్తున్నారు. భక్తులు విశేషంగా శ్రీ స్వామివారిని శ్రీ అమ్మవార్లను దర్శించు కొంటున్నారు. దేవాలయ కార్యదర్శి డి రామకృష్ణంరాజు దర్శన, కుంకుమ పూజలు, తదితర ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *