సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈనెల 13వ తేదీ నుండి భీమవరం పట్టణం గునుపూడిలో వేంచేసియున్న ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రేపు ఆదివారం (15-02-2026) మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారు జాము 3గంటల నుండి స్వామి వారి దర్శనానికి ఆలయానికి పోటెత్తే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, అధికారులు వీఐపీ ప్రోటోకాల్ దర్శన సమయాలను ఖరారు చేశారు. దర్శన వేళల వివరాలు:ఆలయ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం, ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వీఐపీలకు ఈ క్రింది సమయాల్లో ;మాత్రమే’ దర్శన సౌకర్యం కల్పించబడుతుంది: ఉదయం: 5:00 గంటల నుండి 8:00 గంటల వరకు.తదుపరి సాయంత్రం: 4:00 గంటల నుండి 6:00 గంటల వరకు.సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా..మహాశివరాత్రి రోజున స్వామివారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, సామాన్య భక్తుల క్యూ లైన్లకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *