సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం గునుపూడి లో పవిత్ర పంచారామ క్షేత్రం లో వేంచేసియున్నశ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు జరుగబోవు వార్షిక కళ్యాణోత్సవములు(మహా శివ రాత్రి కళ్యాణత్స౦) సందర్భములో ది.13-02-2026 నుంది ది.17-02-2026 వరకు దేవాలయము నందు వివిధ ఏర్పాట్ల నిర్వహణకు సీల్డ్ టెండర్లు దాఖలు కాబడినవి ఈ రోజు ది.09-01-2026 వ తేదీ గం.10-00లకు శ్రీ స్వామి వారి ఆలయం నందు టెండరుదార్లు సమక్షములో వర్దినీడి వెంకటేశ్వర రావు, తనిఖీదారు, దేవదాయధర్మాదాయ శాఖ, భీమవరం వారు మరియు తోట శ్రీనివాస రావు ,దేవాలయం కార్యనిర్వహణాధికారి, రామకృష్ణంరాజు, శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి, సమక్షములో టెండర్లు తెరిచారు. ఈ కార్యక్రమంలో దేవాలయం చైర్మన్ చింతలపాటి బంగార్రాజు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు పడమట లీల, కొప్పర్తి విజయ కుమార్ మరియు బ్రహ్మజోశ్యుల సత్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *