సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం, గునుపూడి నందు పవిత్ర పంచారామ శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వారి దేవస్థానం నందు కార్తీకమాసం 3వ సోమవారం సందర్బముగా వేలాదిగా భక్తులు దర్శించుకొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లడ్డు ప్రసాదం విక్రయించుట ద్వారా రూ.36,000/-లు ,సమర్ధవంతంగా దర్శనం టికెట్స్ విక్రయించడం ద్వారా రూ.8,86,200/-లు మొత్తం రూ.9,22,200/-లు ఆదాయంతో( హుండీ ఆదాయం లెక్కించకుండా) నేడు రికార్డు సృష్టించారు, భక్తులకు తగు ఏర్పాట్లను ధర్మకర్తల మండలి అడ్జక్షురాలు శ్రీమతి కోడే విజయ లక్షీ , ధర్మకర్తలు పర్యవేక్షించారని కార్యనిర్వహణాధికారి. ఎం అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు, ఫై తాజా చిత్రంలో.. తెల్లవారు జాము నుండి అభిషేకాలు పూజలతో, తనదర్సనమ్ కోసం వచ్చిన వేలాది భక్తులకు అస్సిసులు అందిస్తూ అలసిపోయిన పరమేశ్వరునికి నేటి సాయంత్రం చేసిన తాజా దివ్య అలంకారం చూడవచ్చు..
