సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో వాడవాడలా అన్ని దేవి ఆలయాలలో శ్రీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దేవాలయాలలో రోజుకో దేవి అవతారాలలో శ్రీ అమ్మవారులు భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గునుపూడి లోని పవిత్ర పంచారామ క్షేత్రం లో శ్రీ పార్వతి అమ్మవారు రెండవ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి అలంకరణలో దర్శనమిచ్చారు. అలాగే భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో కూడా నిలువెత్తు మూలవిరాట్ స్వరూపం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో విజయనగరం భక్తులు వారి తల్లితండ్రులు స్వర్గీయ కర్రీ సూర్యనారాయణ, పద్మావతి దంపతుల జ్ఞాపకార్ధం సౌజన్యం తో ఏర్పాటు చేసారు. భక్తులు విశేషంగా హాజరు అవుతున్నారు.
