సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం నందు నేడు, కార్తీక మాసం 6 రోజు మొదటి సోమవారం ఆలయమునకు సుమారుగా 15 వేల మంది భక్తులు విచ్చేయగా విశిష్టదర్శనం టికెట్స్ ద్వారా 2 ,40 ,000వేల రూపాయలు లడ్డు ప్రసాదం వలన 35,000 వేల రూపాయలుమొత్తం 2 లక్షల 75 వేల రూపాయలువచ్చిందని, .నేడు కార్తీక సోమవారం అన్న ప్రసాదం వెంప వాస్తవ్యులు గొట్టుముక్కల భీమరాజు దాతృత్వంతో సుమారు గా 9.000 మంది భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేసారని, దేవాలయ ఇఓ రామకృష్ణంరాజు తెలిపారు, నిన్న 26 -10 -2025 తేదీన శ్రీ అన్నపూర్ణ అమ్మవారికి సుమారు 8 గ్రాముల బంగారపు నత్తి గొలుసును స్థానిక భక్తులు కానుకగా అందించారని ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలకమండలి చైర్మన్ చింతలపాటి బంగార్రాజు మరియు ధర్మకర్తలు , ఆలయ అర్చకులు చెరుకూరి రామకృష్ణ అభిషేక పండిట్ కొత్తపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారని తెలిపారు. ఫై తాజా చిత్రంలో శ్రీ స్వామివారి దివ్య దర్సనం..
