సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి నందు వేంచేసి యున్నపంచా రామం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వారి దేవస్థానం నందు కార్తీకమాసం ఆఖరి మరియు 4వ సోమవారం సందర్బముగా లడ్డు ప్రసాదం విక్రయించుట ద్వారా రూ.42,585/-లు నేటి సాయంత్రం 6గంటలవరకు దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.7,04,750/-లు మొత్తం రూ.7,47,335/-లు ఆదాయం ( హుండీ ఆదాయం కాకుండా..) వచ్చింది. సుమారు 50వేల మంది పైగా భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకొన్నారు. ఇంకా భక్తుల కోలాహలం కొనసాగుతుంది. నేటి ఉదయం నుండి ఆలయ ఆవరణలో దాతల భూరి విరాళాలతో నిర్వహించిన భారీ అన్నసమారాధనలో వేలాదిగా భక్తులు ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు తగు ఏర్పాట్లను ధర్మకర్తల మండలి అధ్యక్షలు కోడే విజయ లక్ష్మి ఇతర ధర్మకర్తలు పర్యవేక్షించారని కార్యనిర్వహణాధికారి ఎం అరుణకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే గురువారం తెల్లవారుజాము ఉదయం తో పవిత్ర కార్తీకమాసం ముగియనున్నది.
