సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర పంచారామ క్షేత్రామైన భీమవరం శ్రీసోమేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి 44 లక్షల రూపాయలతో కొనుగోలు చేయడానికి మరో 1 సెంట్ న్నర కీలకమైన స్థలాన్ని స్వామివారికి కానుకగా ఇవ్వడం కోసం ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. శ్రీ స్వామివారి భక్తుడు రాజమండ్రికి చెందిన గన్నంనేని శివరామ కుమార్ సెంట్ న్నర స్థలాన్ని కొనుగోలు చెయ్యడానికి దేవస్థానంకు స్థలాన్నిస్థానిక ఎమ్మెల్యే చేతులమీదుగా నేడు, బుధవారం ఉదయం దేవాలయం కార్యనిర్వహణాధికారి డి రామకృష్ణంరాజు కు అందజేశారు., చైర్మన్ చింతలపాటి బంగార్రాజు, అర్చకులు రామకృష్ణ మాట్లాడుతూ.. స్వామివారి క్షేత్రం పక్కన ఉత్తరం వైపు గోడకు అనుకుని ఉన్న స్థలాన్ని దేవస్థానంలో కలుపుకునేందుకు దాతలు శివరామ కుమార్ ముందుకు వచ్చారని, సెంట్ న్నర స్థలాన్ని కొనుగోలు చేసి స్వామివారికి కానుకగా చేస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగా మొదట రూ 20 లక్షలను స్థల యజమానికి అందించి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నామని, మిగిలిన సొమ్మును కూడా అందించి స్థలాన్ని దేవస్థానంకు ఇచ్చారని అన్నారు. దాతకు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.
