సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామివారి దేవస్ధానము నందు మహాశివరాత్రి పర్వదినము సందర్భంగా దర్శనమునకు విచ్చేసిన వేలాది భక్తులకు భీమవరం శ్రీ సత్యసాయి సేవా సంస్ధలు వారిచే నేటి శనివారం తెల్లవారు జామునుండి పాలు, మినరల్ వాటర్ బాటిళ్లను నిర్వాహకులు రాయప్రోలు చలపతి రావు ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు స్వచ్చంధంగా అందజెయ్యడం జరిగింది. క్యూ లైన్ల వద్దకు వెళ్లి ఫ్లస్కో ల ద్వారా కూడా వేడి పాలు భక్తులకు అందించడం గమనార్హం..మానవ సేవే మాధవ సేవ అంటూ.. సత్య సాయి సూక్తిని ఆచరణ లో పాటిస్తూ , గత కొంతకాలంగా భీమవరం లో ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు వారి బందువులకు ఉచిత భోజనం అందిస్తూ శ్రీ సత్య సాయి సేవ సంస్థ సభ్యులు సేవలు అందించడం ప్రశంసనీయం
