సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం గునుపూడి గ్రామంలో వేంచేసి యున్న పవిత్ర పంచారామా క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం నందు ఈరోజు సోమవారం అనగా ది 16 3 2026 తేదీ ఆలయం నందు భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు కోసం హుండీలు తెరిచి లెక్కించగా రూ 8,50,661/- రూపాయలు ఆదాయం మరియు శ్రీ స్వామివారి శాశ్వత నిత్య అన్నదానం హుండీద్వారా రూ,17,319/-రూపాయలు ఆదాయం లభించింది. హుండీలు లెక్కింపు కార్యక్రమంలో భీమవరం తణిఖీదారు వర్ధినీడి వెంకటేశ్వరరావు మరియు ఆకివీడు గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి ఏ సత్యనారాయణ రాజు మరియు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాడు బంగా ర్రాజు మరియ ధర్మకర్తల మండల సభ్యులు ,ఆలయ అర్చకులు పాల్గొన్నారని కార్యనిర్వాహణాధికారి డీ రామకృష్ణంరాజు తెలిపారు. శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం నందు ది. 17- 3 -2026 తేదీ మంగళవారం మధ్యాహ్నం 2-30 గంటలకు శ్రీ స్వామివారి ఆలయము నందు పాల్లుణ మాసశివరాత్రి సందర్భంగా శ్రీ స్వామివారికి ప్రతి సంవత్సరం నిర్వహించే భస్మాభిషేకం నిర్వహించబడును.
