సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, శనివారం శనిత్రయోదశి సందర్భముగా భీమవరంలోని పవిత్ర పంచా రామం క్షేత్రంలో ఉన్న నవగ్రహాల ఆలయంలో విశేషంగా భక్తులు శ్రీ శనీశ్వర స్వామి వారికీ తైలాభిషేకం పాటు నవగ్రహాలకు చేసిన అభిషేకాలకు చేసిన పూజ తదితర ఏర్పాట్లకు చెల్లించిన రుసుము క్రింద 63,116/ రూపాయలు ఆదాయం వచ్చినట్లు ( బహుశా ఈ నవగ్రహ ఆలయానికి తొలిసారి ఇదే రికార్డు ఆదాయం కావచ్చు..) ధర్మకర్తల మండలి సభ్యులు, మరియు చైర్మెన్ కోడె విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోజు విశేషంగా భక్తులు శ్రీ సోమేశ్వర స్వామిని దర్శించుకొన్నారు. ఎందరో భక్తులు అర్చకులతో చేయిస్తున్న శనీశ్వర శాంతి పూజలతో ఆలయ ఆవరణ ఆధ్యాతిక సందడి కనపడింది.
