సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరంలో పవిత్ర పంచారామ క్షేత్రం గునుపూడి నందు వేంచేసియున్న శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వారి దేవస్థానం నందు కార్తీకమాసం 3వ ఆదివారం సందర్బముగా భక్తులు గత 2 వారాలకు మించి పోటెత్తారు. స్వామి వారి లడ్డు ప్రసాదం విక్రయించుట ద్వారా రూ.14,100/-లు దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.2,65,320/-లు మొత్తం రూ.2,79,420/-లు ఆదాయం వచ్చిందని ఆలయ ఇఓ అరుణ్ కుమార్ తెలిపారు. దాతల సహకారంతో ఆలయం ఆవరణలో వేలాది భక్తులకు అన్నసమారాధన ప్రసాద వితరణ నిర్వహించారు. స్థానికులతో పాటు దూరప్రాంతాల నుండి విశేషంగా వచ్చిన భక్తులకు తగు ఏర్పాట్లను ధర్మకర్తల మండలి అధ్యక్షలు శ్రీమతి కోడే విజయలక్షీ , ధర్మకర్తలు పర్యవేక్షించారు.ఫై తాజా చిత్రంలో సాక్షత్తు చంద్ర ప్రతిష్ట గా భక్తులు భావించే సోమేశ్వరుని నేటి సాయంత్రం చేసిన దివ్య అలంకారం చూడవచ్చు..
