సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న పంచారామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు పవిత్ర కార్తీకమాసోత్సవములు సందర్భముగా గత మంగళవారం రాత్రి శ్రీ స్వామివారి దివ్య అలంకారం ఫై చిత్రంలో చూడవచ్చు. ఇక 11వ రోజు స్వామివారి సేవల వలన రూ.4,566/-లు, దర్శనం టిక్కెట్ల వలన రూ.18,350/-లు, కానుకలు సమర్పణల వలన రూ.816/-లు, లడ్డు ప్రసాదం వలన రూ.4,080/-లు, అన్నదానం ట్రస్టు నిమిత్తం రూ.50,996/-లు మొత్తం రూ.78,808/-లు భక్తులు సమర్పించారని ఇక దేవస్థానం అన్నదానం ట్రస్టు చే 2,500 మందికి అన్నప్రసాదం వితరణ జరుపగా, తాడేపల్లిగూడెం వాస్తవ్యూలు కొట్టు తాతాజీ దంపతులచే లక్షపత్రిపూజా కార్యక్రమం జరిగినది అని ఆలయ ఇఓ డి రామకృష్ణంరాజు తెలిపారు.
