సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: భీమవరం పట్టణం గునుపూడిలొ పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం నందు 105 రోజులకు గాను హుండీలు తెరచి లెక్కించగా రూ 5,27,323/-లు నగదు వచ్చి ఉన్నది. ఈ లెక్కింపు కార్యక్రమము నందు ధర్మకర్తల మండలి అధ్యక్షులు కోడే విజయలక్షి, ధర్మకర్తలు, భక్తులు పాల్గొనగా యనమదురు లోని శ్రీ శక్తేశ్వర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.శ్రీనివాస రావు పర్యవేక్షించారని దేవాలయ కార్యనిర్వహణాధికారి. ఎం అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
