సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కార్తీకమాసం ఏకాదశి సందర్భముగా భీమవరంలో పవిత్ర పంచా రామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు ఉపముఖ్యమంత్రి మరియు దేవదాయ శాఖ మంత్రివర్యులు కొట్టు సత్యనారాయణ సోదరుడు కొట్టు తాతారావు(తాతాజీ) దంపతులు కుటుంబ సభ్యుల సౌజన్యంతో శ్రీ స్వామి వార్కి మహాన్యాస పూర్వక ఏకాదశరుద్రాభిషేకం, లక్ష బిల్వార్ఛన, శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ పార్వీతి అమ్మ వార్లకు కుంకుమార్చన, రుద్రహోమం, సూర్యనమస్కారములు నిర్వహించారు. నేడు, శుక్రవారం విశేష దినం కావడంతో భక్తులు, మహిళలు తెల్లవారు జామునుండి విశేష సంఖ్యలో హాజరయి దేవాలయ ఆవరణలో, చంద్ర పుష్కారిని వద్ద కార్తీక దీపాలంకరణ కు పోటీ పడ్డారు. . ఆలయం నందు భక్తులకు పులిహోర, చక్కెరపొంగలి ప్రసాద వితరణ చేయుట జరిగనది. ఈ కార్యక్రమం నందు ధర్మకర్తల పాల్గొన్నారు అని కార్యనిర్వహణాధికారి ఎం అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
