సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరం గునుపూడి నందు వేంచేసి యున్న పంచారామ క్షేత్రం లో కార్తీకమాసం ఆఖరి రోజు కావడంతో నేడు, బుధవారం భక్తులు విశేషంగా శ్రీ సోమేశ్వరుని దర్శించుకొన్నారు.5 పంచారామ క్షేత్రాలు దర్శించే వాహనాలు, బస్సులతో దూరప్రాంతాల నుండి కూడా భక్తులు వేలాదిగా దర్శనానికి వచ్చారు. ఈ రోజు కూడా భారీ అన్నసమారాధన కార్యక్రమం జరిగింది. ఈ మాసం అంతా దేవాలయ ఆవరణలో రాత్రి పూట సైతం వచ్చే భక్తులకు మజ్జిగ అన్నం ప్రసాద వితరణ నిర్వహించారు.రేపు గురువారం పోలి కార్తీక దీపారాధన నేపథ్యంలో తెల్లవారు జాము నుండి చంద్ర పుష్కరిణి లో దీపాలు వదలటంతో కార్తీకమాసం ముగియనున్నది. కార్యనిర్వహణాధికారి. ఎం అరుణ్ కుమార్ సిగ్మా న్యూస్ తో మాట్లాడుతూ.. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ కార్తీక మాసం లక్షలాది భక్తులు శ్రీ సోమేశ్వరుని దర్శించుకొన్నారని , ఏర్పాట్లు పట్ల సంతృప్తి వ్యక్తం చేసారని, సహకరించిన ధర్మకర్తలమండలికి, దాతలకు, స్వచ్చంద సేవకులకు కృతజ్ఞలు తెలిపారు . రేపు, గురువారం ఉదయం గం.10-00లకు దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు మరియు దేవదాయ ధర్మదాయ శాఖ అధికారుల సమక్షమములో ఈ కార్తీకమాసం లో భక్తులు సమర్పించిన కానుకలను హుండీలు తెరచి లెక్కిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *