సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి నందు పవిత్ర పంచారామ క్షేత్రాలలో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నకు సినీ సంగీత దర్శకులు కోటి విచ్చేయగా, ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్, కోడే విజయలక్ష్మి మరియు ధర్మకర్తలు ఆయనకు స్వామివారి దర్శనం చేయించి స్వామివారి చిత్ర పటాన్ని అందజేసి శాలువా కప్పి స్వామివారి అస్సిసులు అందజేశారు. ఈ కార్యక్రమం లో కార్యనిర్వహణాధికారి చాగంటి సురేష్ నాయుడు పాల్గొన్నారు.
