సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి నందు వేంచేసి యున్న శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం యెక్క శివరాత్రి కళ్యాణ మహోత్సవముల సందర్భముగా ఉత్సవాల ఆహ్వాన పత్రిక ( ఆలయ విశిష్టత, పురాణ ప్రాశస్యం పొందుపరిచారు) ను నేడు, శుక్రవారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో గ్రంధి శ్రీనివాస్ ఆవిష్కరించడం జరిగింది. ఉత్సవాలు ఈ నెల 16వ తేదీ నుండి 20వ తేదీవరకు నిర్వహిస్తున్న నేపథ్యంలో 16 వ తేదీ ఉదయం 7గంటలకు పరమశివునికి రుద్రాభిషేకం నిర్వహించిన తదుపరి శ్రీ అన్నపూర్ణ అమ్మవారికి ఉదయం 9-30 గంటలకు శ్రీ పార్వతి అమ్మవారికి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ దంపతులు ప్రత్యక కుంకుమ పూజలతో ఉత్సవాలలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం నందు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీమతి కోడే విజయలక్ష్మి ,మరియు ధర్మకర్తలు కుర్మదాసు సత్య శ్రీనివాస్, శ్రీమతి నాచు శ్రీవల్లి, శ్రీ లక్కు త్రిమూర్తులు,కోయ తాతాజీ, నల్లం రఘుబాబు, చెల్లబోయిన సూర్య ప్రకాష్, శ్రీమతి సోమాదుల లీలా ఈశ్వరి, తాణల రామకృష్ణ తో పాటు కార్యనిర్వహణాధికారి. ఎం అరుణ్ కుమార్ పాల్గొన్నారు.
