సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి పంచా రామం నందు వేంచేసి యున్న శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానంలో నేడు, ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్డు న్యాయమూర్తి, సి.హెచ్ మనవేంద్ర రాయ్ ఆలయ మర్యాదలతో దర్శించుకొనగా, ఆలయ అర్చకులు పూజాది కార్యక్రమములు నిర్వహించి వారికీ స్వామివారి జ్ఞాపిక అందజెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమం నందు దేవస్తానం చైర్మన్ శ్రీమతి కోడే విజయలక్ష్మి మరియు ధర్మకర్తలు శ్రీమతి నాచు శ్రీవల్లి, నల్లం రఘుబాబు, శ్రీ తాణల రామకృష్ణ మరియు ఇతర జిల్లా న్యాయమూర్తులు, కార్యనిర్వహణాధికారి ఎం అరుణ్ కుమార్ పాల్గొన్నారు.
