సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: సాక్షాతూ చంద్రుడు ప్రతిష్టించాడని స్కంద పురాణం పేర్కొంటున్న.. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం గునుపూడిలోని శ్రీ సోమేశ్వర లింగానికి కి మహాశివరాత్రి కానుకగా సుమారు 260 గ్రాముల బంగారంతో చేసిన హారాన్ని నేడు, శుక్రవారం ఓ భక్తుడు నేడు, శుక్రవారం ఆలయ అధికారులకు బహూకరించారు..( బంగారం హారం విలువ సంబంధిత అధికారులు ఇంకా లెక్కకట్టవలసి ఉంది) దీనితో లక్షలాది రూపాయలు ఖర్చుతో తయారు చేయించిన బంగారు హారాన్ని స్థానిక క్యాంపు కార్యాలయంలో, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌కు ఆలయ ఈఓ అరుణ్‌కుమార్, ప్రధాన అర్చకులు సోంబాబు, రామకృష్ణ, కోడె యుగంధర్, చెల్లబోయిన సూర్యప్రకాశ్, కోయ తాతాజీలు చూపించారు. దానితో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ బంగారు హారాన్ని భక్తి భావంతో తన కళ్లకు హత్తుకొని శ్రీ సోమేశ్వరునికి అలంకరిస్తున్న భక్తుడిని అభినందించారు. శ్రీ సోమేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉంటాయని, ఘనంగా జరుగుతున్నా కల్యాణఉత్సవాలకు ఎంతో దూరప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. · ·
