సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి నందు పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు లోకకళ్యాణార్థం మంచి జరగాలని, సకాలంలో వర్షాలు పడాలని కోరుకొంటూ శ్రీ స్వామి వార్కి అర్చకులు మంత్రోచ్ఛరణలతో కుండలలో తీసుకోని వచ్చిన పవిత్ర జలంతో సహస్రఘటాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, పాల్గొన్నారు. ఆలయం ఆర్చకులు, బ్రాహ్మణులు చే సహస్రఘటాభిషేకం నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి వారి తీర్థ ప్రసాదములు స్వీకరించినారు. ఈ కార్యక్రమం నందు ఆలయం ధర్మకర్తల మండలి ఛైర్మన్, కోడే విజయలక్ష్మి మరియు ధర్మకర్తలు కుర్మదాసు సత్య శ్రీనివాస్, నాచు శ్రీవల్లి, లక్కు త్రిమూర్తులు, నల్లం రఘుబాబు, చల్లబోయిన సూర్యప్రకాష్ రావు, కోయ తాతాజీ, సోమాదుల లీలా ఈశ్వరీ, తాణాల రామకృష్ణ పాల్గొనగా తగు ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి సి.హెచ్.సురేష్ నాయుడు పర్యవేక్షించినారు.
