సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర పంచారామ క్షేత్రామైన భీమవరం శ్రీసోమేశ్వర స్వామి దేవస్థానంకు దాత సెంట్ న్నర స్థలాన్ని కానుకగా కొనుగోలు చేసిన నేపథ్యంలో నేడు, బుధవారం ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. సుమారు రూ 44 లక్షల విలువ కలిగిన సెంట్ న్నర స్థలాన్ని రాజమండ్రికి చెందిన గన్నంనేని శివరామ కుమార్ కొనుగోలు చేసి దేవస్థానంకు స్థలాన్ని అందజేయనున్నారు. ఇప్పటికే దీనిలో భాగంగా కొనుగోలు సొమ్మును ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా దేవస్థానంకు అందించారు. ఆలయ ఈవో రామకృష్ణంరాజు, చైర్మన్ చింతలపాటి బంగార్రాజు, అర్చకులు రామకృష్ణ, సోంబాబు మాట్లాడుతూ స్వామివారి క్షేత్రం పక్కన ఉత్తరం వైపు గోడకు అనుకుని ఉన్న స్థలాన్ని దేవస్థానంలో కలుపుకునేందుకు దాతలు శివరామకుమార్ ముందుకు వచ్చారని, సెంట్ న్నర స్థలాన్ని కొనుగోలు చేసి స్వామివారికి దానం చేస్తున్నారన్నారు. దాతకు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.
