సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న పంచారామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు కార్తీక మాసోత్సవములు సందర్భముగా విశేషంగా భక్తులు స్వామివారిని దర్శించు కొంటున్నారు. గత బుధవారం రాత్రి దేవాలయం ఆవరణలో విశేషంగా విభిన్న ఆకృతులతో మహిళా భక్తులు కార్తీక దీపాలు వెలిగించి దివ్య ప్రకాశాలతో ఆధ్యాత్మిక శోభ ను కన్నుల పండుగగా ప్రదర్శించారు. ( ఫై చిత్రంలో) ఇక గత 12వ రోజు సందర్భముగా సేవల వలన రూ.2,082/-లు, దర్శనం టిక్కెట్ల వలన రూ.12,350/-లు, కానుకలు సమర్పణల వలన రూ.500/-లు, లడ్డు ప్రసాదం వలన రూ.3,060/-లు, అన్నదానం ట్రస్టు నిమిత్తం రూ.48,634/-లు మొత్తంగా రూ.66,626/-లు వచ్చి యున్నది. దేవస్థానం అన్నదానం ట్రస్టు చే 2,100 మందికి అన్నప్రసాదం వితరణ జరిగిందని స్థానికులు దాతలు సహకరించారని ఆలయ ఇ ఓ డి రామకృష్ణంరాజు తెలిపారు.
