సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం, గునుపూడి నందు వేంచేసి యున్న పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు గత 97 రోజులకు గాను భక్తులు సమర్పించిన హుండీ కానుకల కోసం..గ్రామస్తులు, భక్తులు, ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షములో హుండీలు నేడు, బుధవారం ఉదయం తెరచి లెక్కించగా రూ.11,40,352/-లు నగదువచ్చి యున్నది. ఈ లెక్కింపున నందు ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీమతి కోడే విజయలక్ష్మి ,ధర్మకర్తలు నాచు శ్రీ వల్లి, శ్రీ కోయ తాతాజీ, చెల్లబోయిన సూర్యప్రకాష్, సోమాదుల లీలా ఈశ్వరి, తాణాల రామకృష్ణ, మరియు అదిత్య కాలేజీ, కె.జి.ఆర్.యల్ కాలేజీ భీమవరం విద్యార్థీని విద్యార్ధులు, గునుపూడి గ్రామ రెవెన్యూ అధికారి, భక్తులు, గ్రామస్థులు పాల్గొనగా శ్రీ కె.శ్రీనివాసరావు,(కార్యనిర్వహణాధికారి, శ్రీ శక్తేశ్వర స్వామి వారి దేవస్థానం,యనమదుర్రు) వారు పర్యవేక్షించినట్లు దేవాలయ కార్యనిర్వహణాధికారి ఎం అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *