సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర పంచారామ క్షేత్రం భీమవరం గునుపూడి లో వేంచేసియున్న శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాసం నేడు ఆదివారం 12వ రోజు ఆలయమునకు సుమారుగా 7వేల మంది భక్తులు విచ్చేయగా దర్శనముల టికెట్స్ ద్వారా రూ-98,850/- లు లడ్డు ప్రసాదం విక్రయం ద్వారా రూ- 16,000/- లు మొత్తం రూ-1,14,850/- లు ఆదాయం వచ్చింది. అలాగే, విశేషంగా భక్తులు పాల్గొన్న శ్రీ స్వామివారి నిత్యాన్నదానం నందు కానుకల వలన రూ- 95,498/- రూపాయలు వచ్చాయని దేవాలయ కార్యనిర్వహణాధికారి డి రామకృష్ణంరాజు తెలిపారు. రేపు కార్తీక సోమవారం మరింత మంది భక్తులు పెరిగే అవకాశం ఉంది. ఫై తాజా చిత్రంలో మల్లెపూలతో శ్రీ సోమేశ్వరుని అలంకారం దర్శించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *