సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో పవిత్ర పంచారామక్షేత్రం గునుపూడిలోని శ్రీఉమాసోమేశ్వ ర జనార్దన స్వామి వారి దేవస్థానంలో ఈనెల 6వ తేదీ నుంచి మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలలో పాల్గొనే వేలాది భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు, చలువ పందిళ్లు, బారికెట్స్ , లైటింగ్ సెట్టింగ్ ఏర్పాట్లు దాదాపు పూర్తికావచ్చాయి. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి డి.రామకృష్ణంరాజు ఉత్సవాల ఏర్పాట్ల ను వివరించారు. మహాశివరాత్రి ఉత్సవాలను ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. ఉత్సవాలు ప్రారంభంగా 6న స్వామి వారికి రుద్రాభిషేకాలు, లక్షపత్రి పూజ, నిర్వహిస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ దంపతులతో అన్నపూర్ణదేవి అమ్మ వారికి లక్ష కుంకుమపూజ,నిర్వహిస్తామని 7న లక్షపత్రి పూజ, స్వామివార్లకు గ్రామోత్సవం, మహా శివరాత్రి రోజున అంటే 8వ తేదీన భక్తులకు తెల్లవారుజామున 3గంటల నుండి దర్శనం కల్పిస్తారు. అన్నపూర్ణ పార్వతీ దేవి సమేత శ్రీసోమేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం , 9న రథోత్సవం, 10న తెప్పోత్సవం నిర్వహిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *