సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడిలో వేంచేసి యున్న పంచారామ క్షేత్రంలో శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు వార్షిక కళ్యాణోత్సవముల ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటి శనివారం సాయంత్రం 4 గంటల నుండి శ్రీ స్వామివారు దేవేరులతో కలసి వేలాది భక్తుల సమక్షంలో రధోత్సవంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. గత శుక్రవారం శివరాత్రి పర్వదిన సందర్భముగా శ్రీ స్వామివారి ఆలయం నకు వచ్చిన భక్తుల విశిష్ట దర్శనములు, టికెట్స్ , ప్రసాదములు విక్రము ద్వారా రూ.5,26,620/- ఆదాయం వచ్చిందని దేవాలయ కార్యనిర్వహణాధికారి డి. రామకృష్ణంరాజు ఒక ప్రకటనలో తెలిపారు, ఈ వేడుకలలో దాతల సహకారంతో భక్తులకు తగు ఏర్పాట్లను ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులైన కుర్మదాసు సత్యశ్రీనివాస్, నాచుశ్రీవల్లి, లక్కు త్రిమూర్తులు, నల్లం రఘుబాబు, చెల్లబోయిన సూర్యప్రకాష్, సోమాదుల లీలా ఈశ్వరి, తాణాల రామకృష్ణ వారు పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *