సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడిలోని పవిత్ర పంచా రామం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి దేవాలయంలో వేలాది భక్తులు ప్రశాంతం గా క్యూ లైన్ లో దర్శనం చేసుకొంటున్న నేపథ్యంలో స్థానిక జనసేన పార్టీ కి చెందిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వానపల్లి సూర్య ప్రకాష్ తన బందువులకు వేగంగా దర్సనము చేయించాలని క్యూ లైన్ నుండి వారిని దాటించడానికి ప్రయత్నించడం దానిని అక్కడే ఉన్న దేవాలయం ఇఓ రామకృష్ణంరాజు అడ్డుకోవడంతో మాటలు పెరిగి వానపల్లి సూర్యప్రకాష్ దూకుడుగా ఇఓ ను అడ్డు తొలగమని గుండెలపై చెయ్యి పెట్టి త్రొయ్యడం తో వివాదం జరిగింది. ఇది పూర్తిగా ఆలయ సిసి ఫుటేజ్ లో రికార్డు కావడం జరిగింది. ఈ ఘటనను ఇఓ రామకృష్ణంరాజు స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు దృష్టికి తీసుకొనివెళ్ళడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *