సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మునిసిపల్ కమిషనర్ ఎం శ్యామల ఆదేశాల ప్రకారం.. పట్టణ పరిధిలోని ది.18-09-2023 వ తేదీ సోమవారము నుండి జరుగు “గణేష్ చతుర్ధి” ఉత్సవములలో భాగంగా వినాయక మండపములు ఏర్పాటుచేయు ప్రదేశములలో, ఈ దిగువ చూపిన నిబంధనలు తప్పని సరిగా పాటించవలసినదిగా పట్టణ ప్రజలకు మరియు వినాయక ఉత్సవ కమిటీల వారికి ఆదేశాలు నేడు, బుధవారం విడుదల చేసారు. వినాయక విగ్రహమునకు ప్లాస్టిక్ మరియు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఉపయోగించరాదు. విగ్రహ మండపముల యందు డస్ట్ బిన్ తప్పని సరిగా ఏర్పాటు చేయవలెను. విగ్రహ మండపముల యందు ఎమర్జన్సీ నెంబర్లు అనగా 1902 & 100ఏర్పాటు చేయవలెను. విగ్రహ మండపముల యందు మందుగుండు సామాన్ల వినియోగము నిషేధించవలెను. విగ్రహ మండపముల యందు ఫస్ట్ ఎయిడ్ కిట్లు వగైరాలు ఏర్పాటు చేయవలెను…విగ్రహ మండపముల ఏర్పాటుకు ట్రేడ్ లైసెన్స్ పొందవలెను. వినాయక విగ్రహ నిమ్నము సమయములో తగు జాగ్రత్తలు తో పాటు తగిన రూట్ మ్యాప్ ఏర్పాటు చేసుకొని ఎలక్ట్రికల్ వైర్లకు తగలకుండా జాగ్రత్తలు పాటించవలెను.ఈ పురపాలక సంఘములో ది.15-09-2023వ తేదీలోగా విధిగా రిజిస్ట్రేషను చేయించుకొనవలెను, ఇట్లు చేయని మండపములును కేవలం పండుగరోజు మాత్రమే ఏర్పాటుకు అనుమతిగా పరిగణించబడును.

,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *