సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘ కార్యాలయం నందు నేడు, మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టరు మరియు భీమవరం పురపాలక సంఘ ప్రత్యేక అధికారి రాహుల్ కుమార్ రెడ్డి వారి ఆధ్వర్యంలో భీమవరం పురపాలక సంఘం పరిధిలో వివిధ ప్రాంతాలలో అనధికారికంగా ప్రజలకు ఇబ్బందికరంగా చెత్తను ఇతర వ్యర్థలను డంపింగ్ చేస్తున్న ప్రాంతాలను గుర్తించి సదరు ప్రాంతాల్లో జరుగుతున్న అనధికార డంపింగ్ను నిరోధించవలసిందిగా అధికారులకు మునిసిపల్ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సదరు ప్రాంతాల్లో డంపింగ్ చేస్తున్న వ్యక్తిని గుర్తించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిందిగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, అలాగే వివిధ ప్రాంతాలలో మరియు డంపింగ్ యార్డ్ నందు చెత్తను తగలుబెడుతున్న వారిని, చెత్త వేసేవారిని గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడమైనది, ఈ మీటింగ్ నందు మునిసిపల్ కమీషనర్ కె.రామచంద్ర రెడ్డి , ఇతర అధికారులు వార్డ్ శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
