సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మున్సిపల్ కమిషనర్ గా ఛార్జి తీసుకొన్న రామచంద్ర రెడ్డి పట్టణంలోని సమస్యను క్షేత్ర స్థాయిలో పర్యటించి తెలుసుకొంటున్నారు. దీనిలో భాగంగా నేడు, ఆదివారం ఉదయం భీమవరం పురపాలక సంఘ పరిధిలో గల 35 వార్డ్ ను మునిసిపల్ కమీషనర్ కె. రామచంద్ర రెడ్డి తనిఖీ చేశారు, స్థానిక ప్రజలు చెప్పిన పారిశుద్ధ్య పరమైన సమస్యలను, అంశాల ఫై అయన అక్కడే వార్డ్ శానిటేషన్ మరియు సానిటరీ ఇన్స్పెక్టర్ ను విచారించారు. అదేవిదముగా మంచినీటి సరపరా సజావుగా జరిగేలా , ఎక్కడ కూడా మంచి నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారి చేసారు కమీషనర్ తో పాటు De అప్పలరాజు AE కృష్ణ మూర్తి సానిటరీ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ రాజు వార్డ్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు..
