సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం భీమవరం శివారులోని పెద అమిరం లోని జిల్లా కలెక్టరు క్యాంప్ కార్యాలయంలో కలెక్టరు, భీమవరం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి పి. ప్రశాంతి , ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తో కలిసి భీమవరం పట్టణంలో లో జరుగుతున్న పనులపై మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ.. మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి భీమవరం పట్టణాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసే విధంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షలకు రోడ్లపై గుంతలను పూడ్చివేయాలని,వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, భీమవరం జిల్లా కేంద్రం కావడం వల్ల కనెక్టింగ్ రోడ్లను అభివృద్ధి చేసే దిశగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా లోసరి రోడ్డును, పద్మాలయ థియేటర్ నుండి కొమరాడ వెళ్లే రోడ్డును, మెంటే వారి తోట రోడ్డును వెడల్పు చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలో ప్రస్తుతానికి పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు సంబంధించి కూడా అనుమతులు మంజూరు చేయడం జరిగిందని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అన్నారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ యస్. శివరామకృష్ణ, ఎం ఈ త్రినాథ్, టౌన్ ప్లాన్ ఏసిపి గౌరు, టిపిఓ సర్వేశ్వరరావు, డి ఈ రాజారావు, ఏ ఇ లు శ్రీనివాస్, రాజ్ కుమార్, నవ్య, తదితర అధికారులు పాల్గొన్నారు.
