సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఇటీవల కొన్ని ప్రధాన రోడ్డులు రిపేరు చేసినప్పటికీ సందులలో మాత్రం గుంతల పరిస్థితి పట్టించుకొనే నాధుడు లేదు. ఫై చిత్రం 2 టౌన్ అడ్డవంతెన ఇవతల వర్మ ఆసుపత్రి ఎదురుగ సందులోని పరిస్థితి కాస్త వర్షానికే వర్షపు మడుగులు కనిపిస్తున్నాయి. అటు వైపుగా ప్రతి రోజు వందలాది స్కూల్ విద్యార్థులు, ఆసుపత్రి కి వెళ్లే రోగులు ప్రయాణం చేస్తూ ఉంటారు. వాహనాలు పడిపోయి పలువురికి గాయాలు కూడా అవుతుంటాయి. గత దశాబ్దంగా పట్టించుకొనే నాధుడు లేడు. ఇక్కడే కాదు అదే ప్రాంతంలో అయ్యప్ప స్వామి గుడి లోపల ఉన్న పలు సందులలో కూడా రోడ్ల పరిస్థితి దుర్భరంగా ఉంది ఉందని స్థానికులు వాపోతున్నారు.. కాబ్బటి మునిసిపల్ అధికారులు కాస్త ద్రుష్టి పెడితే స్థానికుల బాధలు తప్పుతాయి.
