సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, గురువారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ 2 కోట్ల 49 లక్షల రూపాయల నిధులతో చేపడుతున్న పలు నిర్మాణాలకు శంకుస్థాపన చేసారు. దీనిలో భాగం గా 1 కోటి 85 లక్షల రూపాయలతో పి.పి రోడ్ జంక్షన్ నుండి భారతీయ విద్యా భవన్స్ వరకు కలెక్టర్ కార్యాలయ భవనం వరకు వేస్తున్న అప్రోచ్ సిసి రోడ్డు కు శంకుస్థాపన నిర్వహించారు. తదుపరి 7వ వార్డు.విస్సాకోడేరు రోడ్ చిన్న వంతెన వద్ద.శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. తదుపరి పట్టణంలో విస్సాకోడేరు వంతెన నుండి మొదలు పట్టణంలో పోలీస్ బొమ్మ సెంటర్ వరకు పీపీ రోడ్డుకు ఇరువైపులా పాదచారుల కోసం శరవేగంగా వేస్తున్న ఫుట్ పాత్ లను , కాంక్రీట్ మార్జిన్ లను, రోడ్డు వెడల్పులను, స్థానిక అన్నపూర్ణ థియేటర్స్ సెంటర్ లో కొత్తగా వేసిన డ్రైన్లపై రోడ్లను కవర్ చేస్తూ వేసిన షీల్డ్ నిర్మాణం ను పరిశీలించారు. ఈ కార్యక్రమాలలో ఆయనతో పాటు మున్సిపల్ కమిషనర్ శివరామ కృష్ణ మరియు వైసిపి నేతలు పాల్గొన్నారు. ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *