సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం భీమవరం పట్టణంలో స్థానిక 20 వ వార్డు మరియు 21వ వార్డు కు చెందిన ప్రజల కు ఎడ్వార్డ్ ట్యాంక్ వద్ద శాఖాగ్రంధాలయం ఆవరణలో వైసిపి పట్టణ ప్రెసిడెంట్ తోట బోగయ్య అడ్జక్షతన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పార్టీ మహిళా ప్రెసిడెంట్ గూడూరి ఉమాబాల, ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రసిడెంట్ సభాపతి, మాజీ కౌన్సెలర్స్ మెంటే బలరాం, కురుశెట్టి కాశీ, నల్లం రాంబాబు, అందే భుజంగరావు,తదితరుల సమక్షంలో 20,21 వార్డులలో ఇంకా రైస్ కార్డులు లేనివారితో పాటు ప్రజలకు విద్యార్థులకు నిత్య అవసరమైన పలు ప్రభుత్వ నిర్ధారిత గుర్తింపు పత్రాలు అందజెయ్యడం జరిగింది. ఈ సందర్భముగా వక్తలు మాట్లాడుతూ..భీమవరంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రత్యేక శ్రద్ధతో పట్టువదలకుండా సురక్ష కార్యక్రమాలను వేలాది ప్రజల లబ్ది కి చేరువ చేస్తున్నారని.. రాష్ట్రంలో పారదర్శకమైన, అవినీతి రహిత పాలన అందిస్తున్న సీఎం జగన్.. ఇంకా ఇంటిటికి తిరిగి లబ్దిదారులను వాలంటర్స్ సహకారంతో గుర్తించి వారికీ ప్రభుత్వ సంక్షేమాలు అందించాలని చేపట్టిన సురక్ష కార్యక్రమం వల్ల ప్రజలకు మండల, ఎం ఆర్ ఓ కార్యాలయాలు చుట్టూ పత్రాల కోసం తిరగవలసిన అవసరం లేదని, ప్రజల వద్దకే పాలన సీఎం జగన్ తమ చేతలలో చూపించారని అన్నారు. ఇది ఓర్వలేక చంద్రబాబు, పవన్ లాంటి వాళ్ళు.. దేశానికే ఆదర్శమైన ఈ సచివాలయ వ్యవస్థ ను, వాలంటీర్ వ్యవస్థను ధ్వసం చెయ్యాలని కుట్రలు చేస్తున్నారని , ప్రజలు వారి మోసాలు ను గమనిస్తున్నారని , అన్నారు.
